ఫుట్బాల్ మ్యాచ్ కోసం ఆఫ్రికా టూ ఇండియా.... డ్రగ్స్ దందా చేస్తున్న ఆఫ్రికన్

ఆరు రకాల మాదక ద్రవ్యలను విక్రయిస్తున్న ఓ నైజిరియన్ తో పాటు ఇద్దరిని హెచ్ఎన్న్యూ ను బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో బంజారాహిల్స్ లో పట్టుకున్నట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బుధవారం తెలిపారు.

Update: 2024-08-14 17:34 GMT

దిశ, క్రైమ్ బ్యూరో : ఆరు రకాల మాదక ద్రవ్యలను విక్రయిస్తున్న ఓ నైజిరియన్ తో పాటు ఇద్దరిని హెచ్ఎన్న్యూ ను బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో బంజారాహిల్స్ లో పట్టుకున్నట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బుధవారం తెలిపారు. నైజీరియన్ ఓఫోజోర్ సండే అలియాస్ ఫ్రాంక్, అనస్ ఖాన్, సైఫ్ ఖాన్ లను అరెస్ట్ చేసి కోకైన్ -36 గ్రా., ఎండిఎంఏ -140 గ్రా., ఎక్స్ టసీ పిల్స్ -9., ఏల్ఎస్డి బ్లాట్స్ -6, చరస్ -32 గ్రా., ఎంఈఓడబల్యూ -41 గ్రా. డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మత్తుకు అలవాటు పడిన ఈ ముగ్గురు బెంగుళూరులో ఉంటున్న నైజరియన్స్ నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి వాటిని నగరంలో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో బయట పడింది. 2016 లో స్పోర్ట్స్ వీసా మీద ఆఫ్రికా నుంచి వచ్చిన ఓఫోరోజ్ సండే మొదట ఢిల్లీ, ఆ తర్వాత బెంగుళూరులో ఆల్ స్టార్స్ ఆఫ్రికా స్పోర్ట్స్ క్లబ్ ద్వారా ఫుట్బాల్ మ్యాచ్ లు ఆడుతు ఇక్కడే ఉండిపోయాడు. డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియన్ లు పరిచయం అవడంతో వారితో కలిసి డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఇలా మధ్యప్రదేశ్ నుంచి బెంగుళూరుకు మారిన అనస్ ఖాన్, సైఫ్ ఖాన్ లు నైజీరియన్ తో కలిసి హైదరాబాద్ లో డ్రగ్స్ ను విక్రయిస్తున్నట్లు తెలిసింది. నిందుతుల నుంచి డ్రగ్స్ తో పాటు మొత్తం రూ.1.10 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వివరించారు.


Similar News