బైంసాలో వైఎస్ షర్మిల ప్రజాప్రస్థాన యాత్ర
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టి ప్రజా ప్రస్థాన యాత్రలో భాగంగా శనివారం సాయంత్రం భైంసాకు చేరుకుంది.
దిశ, ముధోల్ : వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టి ప్రజా ప్రస్థాన యాత్రలో భాగంగా శనివారం సాయంత్రం భైంసాకు చేరుకుంది. పాదయాత్రలో బాగంగా బైంసాలో సభలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాకు వైఎస్సార్ ఎంతో చేశారని, ఎన్నో ప్రాజెక్ట్ లు కట్టి ఈ జిల్లాకు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడైనా ఇక్కడ ఉన్నాడా, కాలువల మరమత్తులను ఎప్పుడైనా పట్టించుకున్నాడా అని ధ్వజమెత్తారు.
తాలూకాలో దళిత బందు లొల్లి బాగా నడుస్తుందని, కోరుకున్న వారికి ఎమ్మెల్యే మక్కువ చూపుతున్నారని అన్నారు. ముధోల్ తాలూకాలో ఉన్న బాసరలో వైఎస్సార్ ఐఐఐటి ఏర్పాటు చేశారని అలాంటిది ఇప్పుడు కేసీఆర్ బాసర ఐఐఐటీని బ్రష్టు పట్టించారన్నారు. ఎన్నో రోజులు విద్యార్థులు రోడ్ల మీద పడి ఆందోళన చేశారన్నారు. అమ్మ విజయమ్మ బాసరకు వస్తాను అంటే అనుమతి ఇవ్వలేదని అన్నారు.
దొంగలు పడ్డ ఆరు నెళ్లకు కుక్కలు పడ్డట్లు, ఈ మద్య వచ్చాడు కేటీఆర్ అని ఎద్దవ వేశారు. ఇదే బైంసా పట్టణానికి బైపాస్ రోడ్డు, త్రాగునీరు ఇచ్చిన ఘనత వైఎస్సార్ రాజశేఖర్ కు దక్కుతుందని అన్నారు. మైనార్టీలకు వైఎస్సార్ 4శాతం రిజర్వేషన్లు ఇచ్చారన్నారు. కేసీఆర్ 12శాతం అని మోసం చేశాడని, కేసీఆర్ నిజంగా అనుకుంటే ఒక్క పర్సంట్ అయినా పెంచి రిజర్వేషన్లు ఇవ్వొచ్చు కదా అని మండిపడ్డారు.
ఉద్యోగాలు అడిగితే హామాలి పని చేసుకో అంటున్నారు. కేసీఆర్ బిడ్డలు మాత్రం రాజ్యాలు ఏలాలి. తెలంగాణ బిడ్డలు మాత్రం హమాలి పని చేసుకోవాలా అన్నారు. 16వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 4లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారని, రానున్న రోజుల్లో ప్రజల పక్షాన నిలబడేందుకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టాం, వైఎస్సార్ ప్రతి పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేసి చూపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్ బెజ్జంకి అనిల్, ముధోల్ తాలూకా కోఆర్డినేటర్ బెజ్జంకి ముత్యంరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు హాజరయ్యారు.