కేటీఆర్ సన్నిహితుడికి మహిళల ఘన సన్మానం

నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో సోమవారం రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సన్నిహితుడు భూక్య జాన్సన్ నాయక్ పర్యటించారు.

Update: 2023-05-01 15:04 GMT

దిశ, కడం: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో సోమవారం రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సన్నిహితుడు భూక్య జాన్సన్ నాయక్ పర్యటించారు. ఈ సందర్భంగా లింగాపూర్ పంచాయతీ మహిళ వార్డుసభ్యులు సుతారి సత్యవ్వ, కసుల జ్యోతి, గూగ్లవత్ జ్యోతి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన పలువురు మహిళలు జాన్సన్ నాయక్ కు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొలిపాక నరసయ్య, సుతారి లచ్చన్న, నీరటి బక్కన్న, గూగ్లవత్ కాశీరాములను ఆయన పరామర్శించారు. వారి ఆరోగ్య విషయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కడం జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, పాండవాపూర్ పీఏసీఎస్ డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఆకుల లచ్చన్న, నాయకులు బొంగు వెంకగౌడ్, నరేష్ రాజేందర్, అతిక్, గ్రామానికి చెందిన పెద్ద ఎత్తున నాయకులు మహిళలు, పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News