లోకేశ్వరంలో దళిత బంధు పై మళ్లీ లొల్లి
లోకేశ్వరంలో బుధవారం దళితబంధు పథకంపై మళ్లీ లొల్లి జరిగింది. కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కోసం లోకేశ్వరంకు వచ్చిన ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డిని స్థానిక మహిళలు నిలదీశారు.
దిశ, లోకేశ్వరం : లోకేశ్వరంలో బుధవారం దళితబంధు పథకంపై మళ్లీ లొల్లి జరిగింది. కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కోసం లోకేశ్వరంకు వచ్చిన ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డిని స్థానిక మహిళలు నిలదీశారు. అనర్హులకు దళిత బంధు పథకం వర్తింప చేసేలా లోకేశ్వరం స్థానిక నాయకులు కసరత్తు చేస్తున్నారని, అర్హులకు ఈ పథకంలో లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు.
నెలరోజుల క్రితం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాగా ఆ సమయంలో కూడా మహిళలు ఎమ్మెల్యేను అడ్డుకున్న విషయం తెలిసిందే. పలుకుబడి ఉన్న వారికి మాత్రమే ఈ పథకంలో లబ్ధి చేకూరేలా నాయకులు నివేదికలు తయారు చేసినట్లు వారు ఆరోపించారు. ఇకనైనా అర్హులకు ఈ పథకంలో లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టాలని లేదంటే ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు.