సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలి

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రజలకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.

Update: 2024-12-01 09:59 GMT

దిశ, ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రజలకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లాలో నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవాలను దృష్టిలో ఉంచుకొని ఆదివారం జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో సారథి కళాకారులచే రూపొందించిన ప్రజాపాలన ఆడియో సాంగ్ సిడీని జిల్లా కలెక్టర్ రాజార్షి షా అధికారులతో కలిసి ఆవిష్కరించారు.

    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సంబరాల మొదటి రోజు ఆదివారం (డిసెంబర్ 1న) జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సంబంధిత పాటల సీడీని ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై 7వ తేదీ వరకు కళాకారుల ఆటపాటలతో అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమం లో డీపీఆర్వో తిరుమల, జిల్లా అధికారులు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.   


Similar News