క్రమశిక్షణ,అంకితభావంతో విధులు నిర్వర్తించాలి : ఎస్పీ గౌష్ ఆలం

పోలీసు ఉద్యోగంలో చేరిన ఉద్యోగులు క్రమశిక్షణ, అంకితభావంతో,

Update: 2024-12-02 11:15 GMT

దిశ,ఆదిలాబాద్ : పోలీసు ఉద్యోగంలో చేరిన ఉద్యోగులు క్రమశిక్షణ, అంకితభావంతో, నిబద్ధతతో విధులు నిర్వహించాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. 9 నెలల పాటు కటోర పోలీసు శిక్షణను తీసుకొని ఆదిలాబాద్ జిల్లాకు నూతనంగా విచ్చేసిన 218 పోలీసు సివిల్, ఏఆర్ సిబ్బంది నీ ఉద్దేశించి జిల్లా ఎస్పీ గౌష్ ఆలం మాట్లాడారు. సోమవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నూతనంగా జిల్లాకు విచ్చేసిన సిబ్బందికి పోలీసు వ్యవస్థ పై , పోలీసు విధులపై నిజ జీవితంలో చేయవలసిన పనులపై ప్రత్యేకంగా సూచనలు చేశారు.పోలీసు వ్యవస్థ సమాజంలో బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తుందని తెలిపారు. పోలీస్ స్టేషన్ లో చేయవలసిన విధులపై కనీస అవగాహనను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని సూచించారు.

ఇందులో భాగంగా జిల్లాకు వచ్చిన సివిల్ 94 మెన్ కానిస్టేబుల్ లకు, 46 ఉమెన్ కానిస్టేబుల్ లకు జిల్లావ్యాప్తంగా ఉన్న ఆయా పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్స్ ఉత్తర్వులు అందజేశారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో లో రిసెప్షన్ సెంటర్, సాంకేతికతను వినియోగించుకుని సిబ్బంది, రైటర్స్, జనరల్ డ్యూటీ, కోర్టు డ్యూటీ లాంటి విధులు ఉంటాయని, వాటిపై ప్రతి ఒకరు రానున్న రోజుల్లో పూర్తి పరిజ్ఞానాన్ని సంపాదించాలని తెలిపారు.కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్,బి సురేందర్ రెడ్డి, హసీబుల్లా, ప్రకాష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు,తదితరులు పాల్గొన్నారు.


Similar News