కాంగ్రెస్ పాలనలో విద్యా సంస్థలు ఆగం

కాంగ్రెస్ పాలనలో విద్య సంస్థలు ఆగమయ్యాయని ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆరోపించారు.

Update: 2024-12-01 15:51 GMT

దిశ, ఆసిఫాబాద్ : కాంగ్రెస్ పాలనలో విద్య సంస్థలు ఆగమయ్యాయని ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆరోపించారు. బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని పీటీజీ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటశాల పరిసరాలతో పాటు భోజనం, కూర మెనూ పరిశీలించి మాట్లాడారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు మంచి విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించేందుకు గురుకులాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.

     పదేళ్ల పాలనలో ఎక్కడ కూడా ఘటనలు జరగలేదని, సీఎం రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. పేద విద్యార్థుల ఆరోగ్యాలను గాలికి వదిలారని విమర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు మంచి విద్యనందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లడంలో బీఆర్ఎస్ ముందుంటుందని స్పష్టం చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. 


Similar News