కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్పి తీరుతాం : బోథ్ పట్టణ పద్మశాలి అధ్యక్షుడు మెర్గు భోజన్న
బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన ఎమ్మెల్యే స్థానాలకు బీసీలకు మొండిచేయి చూపించడం ఎంత వరకు సమంజసం అని బోథ్ పట్టణ పద్మశాలి పట్టణ అధ్యక్షుడు మేర్గు భోజన్న అన్నారు.
దిశ, బోథ్ : బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన ఎమ్మెల్యే స్థానాలకు బీసీలకు మొండిచేయి చూపించడం ఎంత వరకు సమంజసం అని బోథ్ పట్టణ పద్మశాలి పట్టణ అధ్యక్షుడు మేర్గు భోజన్న అన్నారు. బుధవారం ఆయన విలేకరుతో మాట్లాడుతూ ఈ నెల ఆగస్టు 13న కోరుట్లలో పద్మశాలి మహాగర్జన కార్యక్రమం చేపట్టి పద్మశాలీయులకు జనాభా ప్రతిపాదకన పది సీట్లు కేటాయించాలని కోరుట్ల సభ నుంచి పద్మశాలీలు పిలుపునిచ్చారని తెలిపారు.
కానీ, బీఆర్ఎస్ పార్టీ పద్మశాలీయులు, బీసీలకు తగు సీట్లు కేటాయించకుండా అవమానించాడని మండి పడ్డారు. ఇప్పటికైనా.. బీసీలందరూ ఏకమై బీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పి తీరుతాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్లకొండ సురేందర్, పట్టణ పద్మశాలి ప్రధాన కార్యదర్శి మాసం అనిల్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి సిరిపురం చంద్రమోహన్, పట్టణ కార్యవర్గ సభ్యులు సిరిపురం సత్తయ్య, సిరిపురం లక్ష్మణ్, సిరిపురం శేఖర్, గాండ్ల బాలరాజు, కటకం గణేష్, సీఎంఎస్ స్వామి, సిలారి నరేందర్, తదితరులు పాల్గొన్నారు.