సింగరేణి కార్మికులకు ఇన్కంటాక్స్ మినహాయింపు చేపిస్తాం :ఎంపీ వివేక్ వెంకటస్వామి
రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే సింగరేణి సంస్థ ద్వారా కార్మికులకు ఇన్కమ్ టాక్స్ మినహాయింపు చేపిస్తామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ పెద్దపల్లి ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు
దిశ,నస్పూర్ : రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే సింగరేణి సంస్థ ద్వారా కార్మికులకు ఇన్కమ్ టాక్స్ మినహాయింపు చేపిస్తామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ పెద్దపల్లి ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు.సోమవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 5 గనిపై బి.ఎం.ఎస్. ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ద్వార సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారని తెలిపారు.ఉద్యమ సమయంలో కార్మికుల సమ్మె కారణంగా దేశంలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తెలంగాణ ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందా అని ఆలోచించారని తెలియజేశారు.
1995లో సింగరేణి అప్పుల్లో కూరుకుపోయినప్పుడు ఎన్టీపీసీ నుంచి 400 కోట్లు ఇప్పించి లక్ష మంది కార్మికుల జీవితాలను తన తండ్రి వెంకటస్వామి కాపాడారని తెలిపారు.తాను కూడా ఎంపీగా ఉన్న సమయంలో రెండు లక్షల వరకు ఇన్కమ్ టాక్స్ కి మినహాయింపు ఇప్పించానని తెలిపారు.బీజేపీ అధికారంలోకి రాగానే కాంట్రాక్టు కార్మికులకు కూడా కోల్ ఇండియా వేతనాలు చెల్లిస్తామని తెలిపారు. అనంతరం మంచిర్యాల జిల్లా బిజెపి అధ్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ పదివేల కొత్త క్వార్టర్లు 400 కోట్లతో నిర్మిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి హామీ ఏమైందని ప్రశ్నించారు.
సిద్దిపేటలో 12 కోట్ల సింగరేణి సొమ్ముతో స్టేడియం ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు.సింగరేణికి సిద్దిపేటకు ఏం సంబంధం అని అక్కడ సింగరేణి నిధులు ఖర్చు పెట్టారో తెలపాలన్నారు.సింగరేణి చరిత్రలో సింగరేణి సొమ్మును వాడుకున్నది కేవలం బీఆర్ఎస్ పార్టీ,ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని తెలిపారు.ఈ కార్యక్రమంలో బి.ఎం.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పేరం రమేష్,బిజెపి జిల్లా జనరల్ సెక్రెటరీ అందుగుల శ్రీనివాస్,నాయకులు నాతాడి శ్రీధర్ రెడ్డి కాదాసు భీమయ్య,పంచెర్పుల నరేష్,సందీప్,జీడి ప్రభాకర్, రాజేందర్,తదితరులు పాల్గొన్నారు.