ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలి

జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని భీమిని తహశీల్దార్ పరమేశ్వర్ అన్నారు.

Update: 2022-11-26 10:27 GMT

దిశ, భీమిని : జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని భీమిని తహశీల్దార్ పరమేశ్వర్ అన్నారు. శనివారం మండలంలోని బిట్టుర్పల్లి గ్రామం పోలింగ్ బుత్ లో ఆయన మాట్లాడుతూ 2023 సంవత్సరం జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండి అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఫారం.6 లో పేరును ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు.

ఓటు నమోదు చేసుకునే వారు ఆధార్ కార్డు వెంట తెచ్చుకావాలని పోలింగ్ కేంద్రాలలో బీఎల్ వో అధికారులు ఉదయం నుండి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు. మండలంలో 15 పోలింగ్ కేంద్రాల ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఓటరు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Tags:    

Similar News