రాష్ట్రంలోనే అత్యధికంగా గుళ్ల నిర్మాణం జరిగింది ఇక్కడే : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మ‌ల్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా దేవాలయాల నిర్మాణం చేపట్టామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

Update: 2022-12-15 14:33 GMT

దిశ ప్రతినిధి, నిర్మల్ : నిర్మ‌ల్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా దేవాలయాల నిర్మాణం చేపట్టామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలోని బంగ‌ల్ పేట్ లో నూతనంగా నిర్మించిన‌ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవోపేతంగా, శాస్త్ర‌ముక్తంగా నిర్వ‌హించారు. అత్యంత సుందరంగా నిర్మించిన ఆలయంలో నాలుగు రోజుల పాటు వేద మంత్రోశ్చరణలతో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. గురువారం ప్రతిష్ట సందర్భంగా నిర్వహించిన‌ ప్రత్యేక కార్యక్రమాల్లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి దంప‌తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో తెలంగాణ రాష్ట్రం దైవభూమిగా మారుతున్నదన్నారు. నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో 132 గ్రామ పంచాయ‌తీల్లో, 42 వార్డుల్లో, ఇలా ప్ర‌తి ఊరు, వార్డుకొక దేవాల‌యాల‌ను నిర్మించామ‌ని తెలిపారు. సుమారు రూ. 3 కోట్ల‌తో కృష్ణ శిల‌ల‌తో మ‌హాల‌క్ష్మి అమ్మ‌వారి ఆల‌యాన్ని పునఃనిర్మించామ‌ని చెప్పారు. ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసిన భక్తులకు, అధికారుల‌కు, ప్ర‌జాప్ర‌తినిదుల‌కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. కార్య‌క్ర‌మంలో దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, అధికారులు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిదులు పాల్గొన్నారు.

Tags:    

Similar News