ఏకశిల కొండపై వెంకన్న బ్రహ్మోత్సవాలు

ఉత్తర వాహినిగా ప్రవహించే గోదావరి తీరంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగర వైభవంగా ప్రారంభమయ్యాయి.

Update: 2022-10-06 11:18 GMT

దిశ, ఖానాపూర్ : ఉత్తర వాహినిగా ప్రవహించే గోదావరి తీరంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగర వైభవంగా ప్రారంభమయ్యాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ గ్రామంలో వెలసిన ఏకశిల వెంకన్న బ్రహ్మోత్సవాలు గురువారం నుండి మొదలయ్యాయి. చక్రపాణి నరసింహ మూర్తి, చక్రపాణి వాసుదేవచార్యులు, ఆచార్య కోటపల్లి అనిష్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నిత్యవిధి, అభిషేకం, మంగళ హారతి మంత్రపుష్పం, విష్ణు యాగం బలిహారణం, నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు మాజీ జడ్పీటీసీ రాథోడ్ రాము నాయక్ తెలిపారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం, రాత్రి స్వామి వారి కల్యాణోత్సవం అంగరంగవైభవంగా నిర్వహింస్తున్నట్లు ఆయన తెలిపారు.

9వ వెంకన్న స్వామి రథోత్సవం..

పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాలజిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, జగిత్యాల జిల్లా, కరీంనగర్ జిల్లాలనుండి, సరిహద్దు అయిన మహారాష్ట్రం నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు రాథోడ్ రామునాయక్, సర్పంచ్ చెప్పల అనూరాధ వెంకట్రాజం, జెడ్పీటీసీ ఆకుల రాజమణి వెంకగౌడ్, ఎంపీటీసీ జంగిలి సరిత శంకర్ తెలిపారు.

Tags:    

Similar News