బెల్లంపల్లిలో పేదలకు దుప్పట్ల పంపిణీ
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మాజీ కేంద్ర మంత్రి కాకా 10వ వర్ధంతిని అట్టహాసంగా నిర్వహించారు.
దిశ,బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మాజీ కేంద్ర మంత్రి కాకా 10వ వర్ధంతిని అట్టహాసంగా నిర్వహించారు. బెల్లంపల్లి ఏఎంసీ చౌరస్తాలో కాక విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్వేత, టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి గెల్లి జయరాం, టీపీసీసీ సభ్యులు సీహెచ్.శంకర్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మల్లారపు చిన్నరాజం, తదితరులు పాల్గొన్నారు.