బీసీ హాస్టల్ వార్డెన్ సస్పెండ్

బెజ్జుర్ మండలంలోని అందుగుల గూడ గ్రామానికి చెందిన డీఎడ్ విద్యార్థిని వెంకటలక్ష్మి మృతికి కారణమైన బీసీ సంక్షేమ హాస్టల్ వార్డెన్ నిఖిల్ తరన్నుం ను సస్పెండ్ చేస్తూ శనివారం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఉత్తర్వులు జారీ చేశారు.

Update: 2024-12-21 15:48 GMT

దిశ, ఆసిఫాబాద్ : బెజ్జుర్ మండలంలోని అందుగుల గూడ గ్రామానికి చెందిన డీఎడ్ విద్యార్థిని వెంకటలక్ష్మి మృతికి కారణమైన బీసీ సంక్షేమ హాస్టల్ వార్డెన్ నిఖిల్ తరన్నుం ను సస్పెండ్ చేస్తూ శనివారం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఇందుకు కారణమని ఉత్త ర్వుల్లో పేర్కొన్నారు. విద్యార్థి అనారోగ్యంతోనే మృతి చెందిందని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి సజీవన్ తెలిపారు.


Similar News