ఇది సాగునీరు కాదు.. తాగునీరు
వేసవికాలం మొదలు కావడంతోనే గ్రామాల్లో తాగునీటి కష్టాలు నెలకొంటున్నాయి.
దిశ, ఖానాపూర్ : వేసవికాలం మొదలు కావడంతోనే గ్రామాల్లో తాగునీటి కష్టాలు నెలకొంటున్నాయి. ప్రతి గ్రామంలోని ప్రజలకు తాగునీటి సమస్యలు లేకుండా చూసేందుకు మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నారు. కానీ ఆ మిషన్ భగీరథ తాగునీరు రోడ్లపై వృథాగా పోతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని మెటపల్లి వెళ్లే రోడ్డు పక్కన ఉన్న మిషన్ భగీరథ తాగు నీటి మెయిన్ వాల్వ్ నుంచి నీరు పెద్ద మొత్తంలో వృథాగా పోతుంది. సుమారు 3 నుంచి 5 హెచ్‌పీల మోటారు నీరు పోతుండటం చూసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి నీటి వృథాను అరికట్టాలని కోరుతున్నారు.