ఖానాపూర్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు సూపర్‌ లగ్జరీ బస్సు

ఖానాపూర్‌ పట్టణ ప్రయాణికుల కోరిక మేరకు ఆర్టీసీ నిర్మల్‌ డిపో నుంచి ఖానాపూర్‌ మీదుగా మెట్‌ పెల్లి–ఆర్మూర్‌ ద్వారా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు సూపర్‌ లగ్జరీ బస్సును నడుపుతున్నట్లు డిపో మేనేజర్‌ ప్రతిమా రెడ్డి ఆదివారం తెలిపారు.

Update: 2025-03-16 11:59 GMT

దిశ, నిర్మల్ టౌన్ : ఖానాపూర్‌ పట్టణ ప్రయాణికుల కోరిక మేరకు ఆర్టీసీ నిర్మల్‌ డిపో నుంచి ఖానాపూర్‌ మీదుగా మెట్‌ పెల్లి–ఆర్మూర్‌ ద్వారా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు సూపర్‌ లగ్జరీ బస్సును నడుపుతున్నట్లు డిపో మేనేజర్‌ ప్రతిమా రెడ్డి ఆదివారం తెలిపారు. ఈ బస్సు ప్రతి రోజూ ఖానాపూర్‌ బస్‌స్టాండ్‌ నుంచి సాయంత్రం 5:30 గంటలకు బయలు దేరి రాత్రి 11:55 గంటలకు శంషాబాద్‌ చేరుకుంటుందని తెలిపారు. తిరిగి మరుసటి రోజు ఉదయం 7:00 గంటలకు బయలు దేరి నిర్మల్‌ చేరుకుంటుందని డిపో మేనేజర్‌ చెప్పారు. ఈ అవకాశాన్ని ఖానాపూర్‌ పట్టణ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


Similar News