సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన అవసరం

సైబర్ క్రైమ్ నేరాలపై జిల్లా ప్రజల్లో అవగాహన ఉండాలని, అందుకు ప్రయాణ ప్రాంగణాల్లో,రైల్వే స్టేషన్ లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం అన్నారు.

Update: 2024-08-21 09:56 GMT

దిశ,ఆదిలాబాద్ : సైబర్ క్రైమ్ నేరాలపై జిల్లా ప్రజల్లో అవగాహన ఉండాలని, అందుకు ప్రయాణ ప్రాంగణాల్లో,రైల్వే స్టేషన్ లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. బుధవారం డీఎస్పీ హసీబుల్లా ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్, బస్టాండ్ లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వీటి ద్వారా చైతన్యపరులైన ప్రజలు, ఆర్టీసీ సిబ్బంది సైబర్ క్రైమ్ ద్వారా మోసపోతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ నెంబర్ను సంప్రదించాలని కోరారు. సరైన సమయంలో న్యాయం జరిగి, పోయిన డబ్బును తిరిగి బాధితునికి అందించడం సంతోషకరంగా ఉందని ఎస్పీ తెలిపారు. బాధితుడు స్థానిక ఆర్టీసీ కండక్టర్ సయ్యద్ ఫర్వీజ్ ఈ నెల పదవ తేదీన క్రెడిట్ కార్డు లిమిట్ ను లక్ష రూపాయలకు పెంచుదాం

     అంటూ ఫోన్ ద్వారా మాయమాటలు చెప్పి బాధితుడు ఎంతకు చెప్పకపోయేసరికి 6000 అదనపు డబ్బులను అందిస్తామని నమ్మించి మోసం చేసి క్రెడిట్ కార్డు వివరాలు, సీవీవీ, ఓటీపీ నంబర్లను తెలుసుకొని 34 వేల రూపాయలను తన ఖాతా నుండి కాజేశారని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పోలీస్ సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమాలతో విషయం తెలుసుకుని వెంటనే 1930 సైబర్ క్రైమ్ నెంబర్ కి ఫోన్ చేసినట్లు బాధితుడు పేర్కొన్నారు. వారు వెంటనే పోగొట్టుకున్న డబ్బులను ఇచ్చేందుకు కేసును నమోదు

    చేసి విచారణ చేసి తిరిగి డబ్బులు ఇప్పించినట్లు బాధితుడు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు బ్యాంక్, పోలీసు అధికారులు అంటూ ఫోన్ చేసే వారి మాయమాటలు నమ్మవద్దని, వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కానీ, 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ను కానీ సంప్రదించాలని సూచించారు. ఇందులో సైబర్ క్రైమ్ డీఎస్పీ హసీబుల్లా, సిబ్బంది సింగర్వార్ సంజీవ్ కుమార్, సంతోష్, రియాజ్ పాల్గొన్నారు. 

Tags:    

Similar News