రైతు చూస్తుండగానే ఎద్దుపై పెద్దపులి దాడి
రైతు చూస్తుండగానే ఎద్దుపై పెద్దపులి దాడి చేసిన ఘటన బోథ్ మండల పరిధిలో చోటు చేసుకుంది.
దిశ, బోథ్ : రైతు చూస్తుండగానే ఎద్దుపై పెద్దపులి దాడి చేసిన ఘటన బోథ్ మండల పరిధిలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షి, బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బాబేరతండా గ్రామానికి చెందిన రైతు జాదవ్ దిలీప్ రేండ్లపండ్లి గ్రామంలో ఉన్న తన పొలంలో ఎడ్లను మేపుతున్నాడు. ఆయన చూస్తుండగానే ఒక్కసారిగా పెద్ద పులి దాడి చేసింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన రైతు ఈ విషయం గ్రామస్తులకు చెప్పాడు. దాంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అలజడి సృష్టించడంతో పులి వెనుతిరిగింది. పెద్ద పులి వచ్చిందన్న సమాచారం తెలియడంతో చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.