ఎన్నికలు సజావుగా సాగేందుకు ఇరు రాష్ట్రాల పోలీసులు సమిష్టిగా పని చేయాలి

పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగేందుకు ఇరు రాష్ట్రాల పోలీసులు సమిష్టిగా పని చేయాలని జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ కోరారు.

Update: 2024-03-13 15:20 GMT

దిశ, ఆసిఫాబాద్: పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగేందుకు ఇరు రాష్ట్రాల పోలీసులు సమిష్టిగా పని చేయాలని జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ కోరారు. బుధవారం మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నాగపూర్ ఐజీ చెర్రింగ్ డోర్జే చంద్రపూర్ ఎస్పీ సుదర్శన్‌లతో సరిహద్దు మధ్య భద్రతా ఏర్పాట్లు సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలుగా ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఇరు రాష్ట్రాల సమన్వయంగా పని చేసి, సరిహద్దుల వద్ద భద్రత చర్యలు పటిష్టంగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రాపర్టీ దొంగతనాలకు సంబంధించిన కేసులు, ఇతరత్ర నేరాలు చేసే ముఠాలను పట్టుకోవడం, ఇతర కేసులను సత్వరమే పరిష్కరించుకోవడంలో సహకరించుకోవాలని సమావేశంలో చర్చించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఎస్పీ రాజశ్రీ షా గౌస్ ఆలం చంద్రపూర్, యావత్మల్ జిల్లా కలెక్టర్ ఎస్పీలు వినయ్ గొద్వా పవన్ దన్ సూద్, ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ వేణు. ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్య, టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ సీఐ రాణా ప్రతాప్, వాంకిడి సీఐ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.


Similar News