రేపు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కసరత్తు పూర్తి....

కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కసరత్తు పూర్తి అయింది.

Update: 2024-03-13 16:25 GMT

దిశ, కాగజ్‌నగర్: కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కసరత్తు పూర్తి అయింది. సిర్పూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు బుధవారం ప్రకటించారు. కాగజ్ నగర్ పట్టణంలోని వినయ్ గార్డెన్ కాంగ్రెస్ పార్టీ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు ప్రకటించారు. తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌కు కొమురం భీం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్, సిర్పూర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ రావి శ్రీనివాస్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోనప్ప మాట్లాడుతూ.. 14 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని సిర్పూర్ నియోజకవర్గంలో అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

25 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని గెలిపించి 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగినట్లు తర్వాత జరిగిన పరిణామాలతో 2014 లో పొన్నాల లక్ష్మయ్య టికెట్ ఇవ్వని పరిస్థితుల్లో బీఎస్పీ టికెట్ పొంది ఎమ్మెల్యేగా గెలవడం, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేశా అనేది అందరికీ తెలుసు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నా సేవ, కార్యక్రమాలను కొనియాడిన విషయం కూడా అందరికీ తెలుసు అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా ప్రజా సేవలకు అంకితమై ఉన్నామని, నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థి ప్రవీణ్ కుమార్ వ్యక్తిగత దూషణలు రౌడీయిజం చేయడం ఎక్కడే నుండో మనుషుల్ని తీసుకొచ్చి తగాదాలు పెట్టడం మీ అందరికీ తెలుసు అని అన్నారు.

అలాంటి వ్యక్తి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేద్దామని నిర్ణయానికి రావడం అనేది చాలా బాధ కలిగించిందన్నారు. కేసీఆర్ విధానాల వల్ల కానీ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కానీ, మేము ఇప్పుడు మాట్లాడలేదన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం దృష్టిలో ఉంచి 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉంటూ తన రాజకీయ జీవితంలో ప్రజా సేవకే అంకితమయ్యా నన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఎస్పీ పార్టీ ప్రవీణ్ కుమార్ పొత్తు పెట్టుకోవడం కలిచివేసిందని మనస్థాపానికి గురై నియోజకవర్గంలో ఉన్న ముఖ్య అనుచరులు సూచనల మేరకే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నామని ప్రకటించారు.

ఈ ప్రాంతం భాగంగా తుమ్మిడిహట్టి ప్రాజెక్టు, చేయాల్సి ఉందని ఇక్కడ ఉన్న సమస్యలను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లినట్లు దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత 20 ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్థులుగా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అల్లుడు రావి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో ఒకటి కానున్నారు. కాంగ్రెస్ పార్టీకి కోనేరు కోనప్ప సహకారం ఎంతో అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి రావి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Similar News