సింగరేణి పాఠశాలలో అత్యున్నత బోధన..

సింగరేణి పాఠశాలలో అత్యున్నత బోధన అందిస్తున్నాయని మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్, ఏరియా సేవా అధ్యక్షురాలు చింతల లక్ష్మిలు అన్నారు.

Update: 2023-02-18 12:41 GMT

దిశ, మందమర్రి : సింగరేణి పాఠశాలలో అత్యున్నత బోధన అందిస్తున్నాయని మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్, ఏరియా సేవా అధ్యక్షురాలు చింతల లక్ష్మిలు అన్నారు. స్థానిక సింగరేణి పాఠశాల వార్షికోత్సవం (స్కూల్ డే) కార్యక్రమానికి వారు ముఖ్య అతిధిలుగా హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగుల పిల్లల విద్యాభివృద్ధిలో రాణించాలని యాజమాన్యం ప్రతి ఏరియాలో ఒక పాఠశాలను నిర్మించిందని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలని పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల ద్వారా తల్లిదండ్రులకు, చదువుకున్న పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు వస్తాయని స్పష్టం చేశారు.

ప్రస్తుతం విద్యను అభ్యసించడంలో ప్రవేట్ పాఠశాల నుండి చాలా పోటీ ఉందని అన్నారు. అందుకు తగ్గట్టుగా ఉపాధ్యాయులు, విద్యార్థులు శ్రద్ధ చూపాలని అన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. గత సంవత్సరం పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అలాగే ఆటల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓటు జీఎం కృష్ణారావు , (హెచ్.ఓ.డి) పర్సనల్ శ్యాంసుందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుందర్ రావు ఉన్నతాధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags:    

Similar News