శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు : ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

జిల్లాలోని పోలీస్ అధికారులు గ్రామ ప్రజలతో మమేకమై ఉండాలని

Update: 2024-09-30 12:01 GMT

దిశ, ఆసిఫాబాద్ : జిల్లాలోని పోలీస్ అధికారులు గ్రామ ప్రజలతో మమేకమై ఉండాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నెలవారీగా నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పోలీస్ అప్రమత్తతో విధులు నిర్వహిస్తూ జిల్లా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం స్టేషన్ పరిధిలోని గ్రామాలను సందర్శిస్తూ,గ్రామ ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. అలాగే స్టేషన్ పరిధిలో ఆటోలకు ప్రత్యేక యూనిక్ నెంబర్ జారీ చేయాలని, ఆ నెంబర్ ద్వారా ఆటో డ్రైవర్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే విధంగా చూడాలన్నారు. స్టేషన్ ల వారీగా ప్రతివారం పోలీసు కవాతు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే గంజాయి కేసులు, రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు, బైండోవర్లు, ఎస్సీ ఎస్టీ కేసులు, పోక్సో కేసులు, దొంగతనాలు, మహిళలపై జరిగే నేరాలు, ఎన్ బీ డబ్ల్యూ వారింట్లపై పోలీస్ అధికారులను ఆరా తీశారు. స్టేషన్ లో కేసు పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. దుర్గామాత నవరాత్రి ఉత్సవాలకు ప్రతిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


Similar News