రైతు వేదికకు తాళం వేసిన భూమి యజమాని

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలంలోని రుద్రాపూర్ గ్రామంలోనీ రైతు వేదికకు దుర్గం వేంకటి రైతు వేదిక‌కు తాళం వేసి నిరసన తెలిపారు. అతనికి గ్రామస్తులు మద్దతుగా నిలిచారు.

Update: 2024-09-29 07:29 GMT

దిశ, చింతల మానేపల్లి: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలంలోని రుద్రాపూర్ గ్రామంలోనీ రైతు వేదికకు దుర్గం వేంకటి రైతు వేదిక‌కు తాళం వేసి నిరసన తెలిపారు. అతనికి గ్రామస్తులు మద్దతుగా నిలిచారు. కాగా ఈ వ్యవహారంపై రైతు దుర్గం వెంకటి మాట్లాడుతూ.. తన సొంత భూమిలోనీ 97/175/1/1/4 సర్వే నెంబర్ గల 0-10 గుంటల భూమిని పాలకుల, అధికారుల సమక్షంలో దానంగా చేయడం జరిగిందన్నారు. రైతు వేదిక శిలాఫలకంపై అమ్మ నాన్న పేర్లను పెట్టాలని, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి బాండ్ పేపర్‌లో రాసి ఇచ్చినందుకు నా భూమిని దానం చేశానని గుర్తు చేశారు.

రైతు వేదిక శిలాఫలకంపై అమ్మ నాన్న పేర్లు ఇంకా రాయలేదు, అటెండర్ ఉద్యోగం ఇచ్చి నాలుగు సంవత్సరాలు అవుతున్న ఒక్క నెల కూడా జీతం రాకపోవడంతో.. నిరసనగా తెలిపానని చెప్పుకొచ్చారు. నాకు న్యాయం జరిగే వరకు ఏ అధికారిని కానీ పాలకులను కానీ రైతు వేదికకు రాకుండా అడ్డుపడతారని తెలిపారు. నాలుగు సంవత్సరాల జీతంను వెంటనే చెల్లించాలని, శిలాఫలకంపై తన అమ్మ నాన్న పేర్లను రాయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ తనకు న్యాయం జరగకపోతే మరణమే శరణం అని తెలిపారు. గ్రామస్తులు భూ యజమాని దుర్గం వెంకటి‌కి మద్దతు పలికారు. బాధితుడునికి న్యాయం జరగకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని గ్రామస్తులు తెలిపారు.

ఏవో రామకృష్ణ ను వివరణ కోరగా..

బదిలీ అయిన ఏఈఓ విజయ్ సమక్షంలో రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని ఏవో రామకృష్ణ తెలిపారు.


Similar News