శిథిలావస్థలో పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు

ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని పాఠశాల భవనాలు శిథిలావస్థకు

Update: 2024-09-30 13:14 GMT

దిశ, కాగజ్ నగర్ : ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా తరగతి గదులు కురుస్తుండడంతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. కాగజ్ నగర్ పట్టణంలోని సంఘం బస్తీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గత రెండు రోజుల క్రితం పాఠశాల తరగతి గది గోడ కూలిపోయిందని విద్యార్థులు ఆందోళన చెందారు. సోమవారం పాఠశాల కు చేరుకున్న విద్యార్థులు బిక్కు బిక్కు మంటూ చదువును అభ్యసించవలసి వస్తుందని వాపోయారు. గోడ కూలిన సమయంలో తరగతి గదిలో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పిందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తరగతి గదుల గోడలు నీటితో నానిపోయి ఉన్నాయన్నారు. తరగతి గదిలో చదువుకోవాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అని చదువును సాగిస్తున్నామని అన్నారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల స్థలంలో నూతన భవనాన్ని నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


Similar News