విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
గురుకుల ఆశ్రమ సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
దిశ, ఆసిఫాబాద్ : గురుకుల ఆశ్రమ సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, ఎం.డేవిడ్ లతో కలిసి అన్ని ప్రభుత్వ యాజమాన్య వసతి గృహాల ప్రిన్సిపాల్ లు, వార్డెన్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గిరిజన ఎస్సీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో కొనసాగుతున్న వసతి గృహాల విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించడంతో పాటు పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించారు.
ఇందు కోసం ప్రభుత్వం డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్ చార్జీలు 20 శాతం పెంచిందని తెలిపారు. వంట సామాగ్రి నిల్వలు ,వంట చేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వంట సామాగ్రి క్రమ పద్ధతిలో వినియోగించాలని, స్టాక్ అధిక మొత్తంలో నిల్వ చేయొద్దని సూచించారు. విద్యార్థులకు అందించే మెనూ పట్టికను వంట గది, భోజనశాల వద్ద ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు.