ప్రాణాంతకమని తెలిసినా పెంచడమెందుకో....
మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు హరితవనం, వెంచర్లలో ప్రాణాంతకం అని తెలిసినా కోనో కార్పస్ మొక్కలు పెంచుతున్నారు.
దిశ, బోథ్ : మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు హరితవనం, వెంచర్లలో ప్రాణాంతకం అని తెలిసినా కోనో కార్పస్ మొక్కలు పెంచుతున్నారు. పర్యావరణంలోని అన్ని రకాల చెట్లు మనకు మేలు చేస్తాయని అనుకోకూడదని, హాని చేకూర్చే చెట్లు కూడా ఉన్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
అటువంటి ప్రమాదకరమైన మొక్కల్లో కోనో కార్పస్ ఒకటి. మంగ్రూవ్ మొక్కలుగా పిలిచే వీటిని అవగాహన లేక నాటుతున్నారు. ఈ మొక్కల వల్ల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెట్ల నుంచి వచ్చే గాలిని పీల్చే వారు శ్వాసకోశ సమస్యలతో బాధపడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి ప్రాణాంతకమైన కోనో కార్పస్ చెట్లు ఎక్కడైనా ఉంటే తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.