నిర్ణీత గడువులోపు బియ్యాన్ని సరఫరా చేయాలి

పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలకు నిర్ణీత గడువులోగా బియ్యం సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అధికారులను ఆదేశించారు.

Update: 2024-12-12 12:56 GMT

దిశ, ఆసిఫాబాద్ : పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలకు నిర్ణీత గడువులోగా బియ్యం సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయం మార్కెట్ యార్డులోని ఎంఎల్ఎస్ పాయింట్ ను జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ తో కలిసి సందర్శించి బియ్యం నిల్వలను పరిశీలించారు.

    ఎంఎల్ఎస్ పాయింట్ నుండి కేటాయించిన దాని ప్రకారంగా గురుకుల పాఠశాలలు, అంగన్వాడీల కు నాణ్యమైన బియ్యాన్ని టెండర్ లో పేర్కొన్న వాహనాలనే సరఫరా చేయాలని, వాహనాలకు జీపీఎస్ ట్యాగ్ అమర్చాలని సూచించారు. బియ్యం లోడుతో వెళ్లే వాహనం దారి మధ్యలో ఎక్కడా ఆగకుండా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. టెండర్ లో సూచించిన వాహనాలను కాకుండా వేరే వాహనాల్లో బియ్యం తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


Similar News