నైపుణ్యంతో కూడిన పనితనాన్ని ప్రదర్శించాలి : ఎస్పీ గౌష్ ఆలం

కొత్తగా కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరూ నైపుణ్యంతో కూడిన పనితనాన్ని ప్రదర్శించాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం అన్నారు.

Update: 2024-12-11 14:33 GMT

దిశ, ఆదిలాబాద్ : కొత్తగా కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరూ నైపుణ్యంతో కూడిన పనితనాన్ని ప్రదర్శించాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. నూతనంగా ఆదిలాబాద్ జిల్లాకు విచ్చేసిన సివిల్ కానిస్టేబుళ్లకు బుధవారం నుండి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభయ్యాయి. ఈ కార్యక్రమంలో మొదటి రోజు శిక్షణ కానిస్టేబుళ్లకు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం మార్గ నిర్దేశం చేశారు. జిల్లాకు వచ్చిన నూతన సివిల్ కానిస్టేబుళ్లకు మూడు బ్యాచులుగా విభజించి ప్రతి బ్యాచ్ కు వారం రోజులపాటు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.

    శిక్షణలో భాగంగా వారు పోలీస్ స్టేషన్ నిర్వహణ, విధులు, సాంకేతిక పరిజ్ఞానం, దాని వినియోగంపై శిక్షణ ఇస్తామన్నారు. సందేహాలను పరిష్కరించే దిశగా ముగ్గురు నిష్ణాతులైన అధికారులను నియమించనున్నట్టు చెప్పారు. సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పిస్తూ 1930 టోల్ ఫ్రీ నెంబర్ పై అత్యవసర సమయాలలో స్పందించాలని తెలిపారు. ఇందులో ఉమెన్స్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ వెంకటి, ఎస్సై ముజాహిద్, శ్రీకాంత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


Similar News