అన్ని రంగాల్లో రాణించాలి : ఎమ్మెల్యే కోవ లక్ష్మి.
విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని
దిశ, ఆసిఫాబాద్ : విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన క్రీడా ముగింపు పోటీల్లో పాల్గొన్నారు. వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. విద్యార్థులు క్రీడా పోటీల్లో ప్రతిభ కనబర్చి జిల్లా రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మల్లికార్జున్ గిరిజన సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.