Shannayak : డీసీసీ అధ్యక్షుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి

పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడికి పాల్పడిన డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ ను వెంటనే కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్ డిమాండ్ చేశారు.

Update: 2024-11-02 12:47 GMT

దిశ, ఆసిఫాబాద్ : పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడికి పాల్పడిన డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ ను వెంటనే కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్ డిమాండ్ చేశారు. గొడవ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కులగణన ప్రజాభిప్రాయ సేకరణ సమావేశానికి సంబంధించి తమకు కనీస సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించినందుకు కార్యకర్తలపై డీసీసీ గుండాలు తమపై దాడి చేశారని ఆరోపించారు.

     ఎమ్మెల్యే ఎన్నికల్లో కోవలక్ష్మిని గెలిపించేందుకు కేసీఆర్, హరీష్ రావుల నుంచి ప్యాకేజీ తీసుకుని తనను ఓడించారని ఆరోపించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన అధ్యక్షుడే పార్టీని నాశనం చేస్తున్నాడని వాపోయారు. పార్టీలో పనిచేసే కార్యకర్తలకు కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. తమపై దాడికి పాల్పడిన డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, అతని అనుచరులను పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News