తీరిన రోడ్డు సమస్య
మండల కేంద్రంలోని బోథ్ (బి ),మేడి శివారం, హనుమాన్ నగర్ రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు నిత్యం అవస్థలు పడుతున్నారు.
దిశ, బోథ్ : మండల కేంద్రంలోని బోథ్ (బి ),మేడి శివారం, హనుమాన్ నగర్ రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు నిత్యం అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యను స్థానిక రైతులు సొసైటీ డైరెక్టర్ చట్ల ఉమేష్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఉమేష్ అక్కడికి వెళ్లి రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించి సమస్యను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు.
దీంతో ఆదివారం ఆయన సొంత నిధులతో గత కొన్నేళ్లుగా బురదమయంగా ఉన్న దారిని బాగు చేయించి మధ్యలో సిమెంటు పైపు వేయించి మొరం పోయించారు. దీంతో గత కొన్నేళ్లుగా రైతన్నలు పడుతున్న సమస్య పరిష్కారం అయింది. తమ సమస్యను పరిష్కరించినందుకు ఉమేష్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు రావుల శంకర్, కుమ్మరి రాజు, పుధారి నర్సయ్య, చంద్రమోహన్, చాంద్ పాషా, భగవాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.