ప్రతిభకు అరుదైన పురస్కారం..

రామకృష్ణాపూర్ వాసి పొన్నాల సాగర్ కు కల్చరల్ ఆక్టివిటీస్ లో అరుదైన పురస్కారం వరించింది.

Update: 2025-01-07 04:12 GMT

దిశ, రామకృష్ణాపూర్ : రామకృష్ణాపూర్ వాసి పొన్నాల సాగర్ కు కల్చరల్ ఆక్టివిటీస్ లో అరుదైన పురస్కారం వరించింది. హైదరాబాద్ మహా నగరంలో సోమవారం గాడ్ సన్ హోలీ స్పిరిట్ థియోలాజికల్ అకాడమీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టాలెంట్ పోటీల్లో రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన సాగర్ పాటలను సైతం ప్లుట్ మాదిరిగా తన పెదవులతో ఏకధాటిగా సుమారు ఒక గంట పాటు వాయించారు. ఈ మేరకు గాడ్ సన్ హోలీ స్పిరిట్ థియోలాజికల్ అకాడమీ సాగర్ కు డాక్టరేట్ ను అందించింది. అనంతరం తెలంగాణ రాష్ట్ర మైనారిటీ జనరల్ సెక్రటరీ డాక్టర్.సీహెచ్ అరుణ్ జ్యోతి, డాక్టర్ ఎం.వి ప్రసాద్, సినీ ఆర్టిస్టులు పృథ్వీరాజ్ సాగర్ ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కన్వీనర్ డాక్టర్ మల్లెపూల వెంకటరమణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


Similar News