సమస్యల వలయంలో ఆర్ అండ్ బీ కార్యాలయం..

బోథ్ నియోజకవర్గ కేంద్రంలోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో ఉన్నతాధికారులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళతారో తెలియని పరిస్థితి నెలకొంది.

Update: 2025-01-07 04:26 GMT

దిశ, బోథ్ : బోథ్ నియోజకవర్గ కేంద్రంలోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో ఉన్నతాధికారులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళతారో తెలియని పరిస్థితి నెలకొంది. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి కనీసం మూత్రశాలకు, మరుగుదొడ్డికి పోదామన్న కిలోమీటర్ పోవాల్సిందే. అంతే గాకుండా కార్యాలయం లోపల టైల్స్ కుంగిపోవడంతో అందులో నుండి అప్పుడప్పుడు పాములు కూడా వస్తుండడంతో భయం భయంతో విధులు నిర్వహిస్తున్నామని సిబ్బంది వాపోతున్నారు.

ఈ కార్యాలయం చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్ కూడా సగం వరకు కూలిపోయి ప్రమాదకర స్థితిలో ఉంది. ఈ విషయమై ఇంచార్జి డీఈ బీమ్ సింగ్ ను ఫోన్లో సంప్రదించగా పేపర్ వర్క్ ఎక్కువగా ఉండటం వలన ఆదిలాబాద్ ఆఫీస్ కు వెళ్తున్నాము కాగా ఆర్ అండ్ బి కార్యాలయం లో ఉన్న సమస్యలను తెలుపగా మరుగుదొడ్లకు, కాంపౌండ్ వాల్ కు ప్రతిపాదనలు పంపిస్తామని అంతేగాకుండా ఆర్ అండ్ బి కార్యాలయం బోర్డు ప్రజలకు కనిపించే విధంగా రోడ్డుకు ఏర్పాటు చేస్తామని తెలిపారు.


Similar News