దిశ, వాంకిడి: అటవీశాఖ అధికారులు చితకబాదారు. ఆపై రూ. 40 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారని. మంగళవారం దిశ పత్రికలో రాసిన కథనానికి స్పందన లభించింది. బుధవారం కోమటి గూడ గ్రామానికి వెళ్ళి ఎఫ్‌ఆర్‌వో అప్పుల కొండ విచారణ చేపట్టారు. బాధితులతో పాటు గ్రామస్థులతో మాట్లాడి వివరాలను సేకరించి, తీసిన వీడియోను పరిశీలించారు. విచారణలో వసూళ్లకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సాదిక్ హుస్సేన్, సెక్షన్ ఆఫీసర్ అత్తరుద్ధిన్ ఇద్దరినీ సస్పెన్షన్ వేటు వేస్తూ జిల్లా అటవీ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.