రోడ్ల డొల్లతనం బైటపడేనా..

కుబీర్ మండల కేంద్రంలో అధికార పార్టీ నాయకులు ఎన్ఆర్ఈజీఎస్ క్రింద ఇటీవల చేపట్టిన సీసీ రోడ్లు నాణ్యత లోపంతో నాసిరకంగా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

Update: 2023-09-29 09:43 GMT

దిశ, కుబీర్ : కుబీర్ మండల కేంద్రంలో అధికార పార్టీ నాయకులు ఎన్ఆర్ఈజీఎస్ క్రింద ఇటీవల చేపట్టిన సీసీ రోడ్లు నాణ్యత లోపంతో నాసిరకంగా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో కొంత మంది స్థానికులు సీసీ రోడ్ల నాణ్యత పై జిల్లా కలెక్టర్ కు కొందరు స్థానికులు ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారి ఆదేశాల మేరకు అధికారులు రోడ్డు పనులను పరిశీలించివెళ్లారు. క్వాలిటి కంట్రోలింగ్ అధికారులు ఒక సీసీరోడ్డు నాణ్యత శాంపిల్లను కూడా తీసుకువెళ్లారు. వేసిన కొన్నిరోజులకే కంకర తేలి గుంతలు ఏర్పాడుతున్నాయి.

సామాన్య జనానికి సైతం రోడ్డు పరిస్థితి ఇట్టే తెల్సిపోతుంది. సంబంధిత శాఖలో పూర్తి శిక్షణ పొందిన క్వాలిటి కంట్రోలింగ్ అధికారులు తీసుకువెళ్లిన షాంపిల్లళ్ళో రోడ్ల నాణ్యత డొల్లతనం బయట పెడతారా లేదా అన్న ఆసక్తి స్థానికుల్లో నెలకొంది. అధికారులు కాంట్రాక్టర్లు ఒకటైతారా..! అని అధికారుల నివేదిక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన సీసీ రోడ్ల పనుల పై కూడా జిల్లా అధికారికీ ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అధికార పార్టీ నాయకులకు అధికారులు వత్తాసు పలకడంతో ఇష్టారాజ్యంగా పనులు చేశారన్న విమర్శలు ఉన్నాయి. దీనికి బాధ్యులు అధికారులా, కాంట్రాక్టర్లా అన్నది తేల్చి ప్రజలకు సమాధానం చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News