కవ్వాల్ టైగర్ జోన్ లోని సమస్యలను పరిష్కరించాలి

కవ్వాల్ టైగర్ జోన్ లో ఫారెస్ట్ అధికారులు అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని, తక్షణమే అభివృద్ధి పనులు జరిగేలా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.

Update: 2025-03-22 10:20 GMT
కవ్వాల్ టైగర్ జోన్ లోని సమస్యలను పరిష్కరించాలి
  • whatsapp icon

దిశ, ఉట్నూర్ : కవ్వాల్ టైగర్ జోన్ లో ఫారెస్ట్ అధికారులు అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని, తక్షణమే అభివృద్ధి పనులు జరిగేలా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం శాసనసభలో ఖానాపూర్ నియోజకవర్గంలోని సమస్యలపై గళమెత్తారు. నియోజవర్గ పరిధిలో కవ్వాల్ టైగర్ ఫారెస్ట్ ప్రాంతాల్లోని గ్రామాల్లో 3ఫేస్ కరెంటు అందించడానికి అధికారులు అడ్డుకుంటున్నారని, కడెం మండలంలోని గంగపూర్ పరిసర ప్రాంతాలలో 3ఫేస్ కరెంటు ఏర్పాటు చేస్తే ఫారెస్ట్ అధికారులు ఆ గ్రామ ప్రజలను కార్యాలయాలకు పిలిచి ఇబ్బందులకు గురి చేసి అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తున్నారని పేర్కొన్నారు.

    లిఫ్ట్ ఇరిగేషన్ పనులు దాదాపు పూర్తి అయ్యాయని, ఫారెస్ట్ సమస్యల కారణంగా ఆటంకం కలుగుతుందని, సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. దస్తురాబాద్ మండలంలో పోచమ్మ ఆలయ నిర్మాణానికి ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని, అటవీ శాఖ మంత్రి తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ ఫారెస్ట్ అధికారులు ఆదేశాలు జారీచేసి అభివృద్ధి సక్రమంగా జరగడానికి కృషి చేయాలని కోరారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులకు 12 నెలల జీతం ఇవ్వాలని, వారిని ప్రతి ఏడాది ఇంటర్వూ ఆధారంగా కాకుండా ఆటో రెన్యువల్ చేయాలన్నారు. 


Similar News