వేతనాల కోసం ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన...

వేతనాల కోసం ఏడు నెలలుగా ఇబ్బంది పడుతున్న తమను పట్టించుకోవడం లేదని బెజ్జూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు వసంత్, శంకర్, మొండి రమేష్, ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2024-11-11 13:07 GMT

దిశ, బెజ్జూర్ : వేతనాల కోసం ఏడు నెలలుగా ఇబ్బంది పడుతున్న తమను పట్టించుకోవడం లేదని బెజ్జూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు వసంత్, శంకర్, మొండి రమేష్, ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం బెజ్జూర్ ఎంపీడీవో కార్యాలయం ముందు చెత్త ట్రాక్టర్తో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు నిరసన తెలిపారు. తాము పని చేస్తున్నా వేతనాలు ఇవ్వడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బెజ్జూరు గ్రామపంచాయతీలో 9 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు.

ఏడు నెలలుగా వేతనాలు లేక తాము ఎలా జీవించాలని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే తమ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఎంపీడీవో ఎంపీడీవో గౌరీశంకర్, గ్రామపంచాయతీ కార్యదర్శి తుకారాంను సంప్రదించగా, వేతనాలు ఇవ్వాల్సింది వాస్తవమేనని, గ్రామపంచాయతీకి ప్రత్యేక అధికారి లేనందున ఆలస్యం అవుతున్నట్లు తెలిపారు. రెండు నెలల వేతనాలు మంజూరై ఉన్నట్లు తెలిపారు. గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బెజ్జూరు గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు రెండు రోజుల్లోగా పరిష్కరిస్తామని ఎంపీడీవో గౌరీ శంకర్ హామీతో కార్మికులు ఆందోళన విరమించారు.

Tags:    

Similar News