సన్న వడ్లకు రూ.500 బోనస్

రైతులు తాము పండించిన పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దే అమ్మకాలు చేపట్టాలని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు.

Update: 2024-11-14 09:22 GMT

దిశ, ఉట్నూర్ : రైతులు తాము పండించిన పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దే అమ్మకాలు చేపట్టాలని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. గురువారం ఉట్నూర్ మండలంలోని కొత్తగూడ (చెక్ పోస్ట్), దంతన్ పల్లి గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పాల్గొని ప్రారంభించారు.

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని, రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. తక్కువ ధరల్లో పంటలను అమ్ముకొని నష్టపోవద్దని, ప్రభుత్వం కల్పించిన గిట్టుబాటు ధరకే అమ్మాలని సూచించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. అధికారులు కొనుగులు కేంద్రాల నిత్యం పర్యవేక్షణ చేస్తూ ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తుందన్నారు. రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని, వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తున్నామన్నారు.

పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తా

జెడ్పీఎస్ఎస్ పాఠశాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం ఉట్నూరు మండలంలోని దంతనపల్లి గ్రామంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర్య సమరయోధులు, దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు.

    అంతకుముందు చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యేను పాఠశాల ఉపాధ్యాయులు శాలువాతో సన్మానించారు. అదే విధంగా మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఐకేపీ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 


Similar News