రాస్తారోకో చేపట్టిన రైతులు.. రహదారి పై నిలిచిన రాకపోకలు...

ధాన్యం కొనుగోళ్ళలో జాప్యాన్ని నిరసిస్తూ లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన వందలాది మంది రైతులు రాస్తారోకో చేపట్టారు.

Update: 2024-11-14 08:00 GMT

దిశ, లోకేశ్వరం : ధాన్యం కొనుగోళ్ళలో జాప్యాన్ని నిరసిస్తూ లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన వందలాది మంది రైతులు రాస్తారోకో చేపట్టారు. ఆ గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో గల నిర్మల్ - బైంసా రహదారి పై అర్లీ ఎక్స్ రోడ్డు వద్దకు 10 గంటలకు చేరుకొని రాస్తారోకో నిర్వహిస్తున్నారు. దీనితో వందలాది వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 40 రోజులు గడిచినా ధాన్యం తూకం వేయడం లేదని, తూకం వేసిన 6 లారీల ధాన్యాన్ని రైస్ మిల్లుకు పంపినా తాలు, తప్ప ఉందనే సాకుతో మిల్లర్లు ధాన్యాన్ని దింపుకోవడం లేదని అన్నారు. క్వింటాలు ధాన్యానికి అదనంగా ఏడుకిలోలు ఇచ్చినా మిల్లర్లు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం చేతికి వచ్చి 45 రోజులు గడిచినా కొనుగోలు ప్రారంభించకపోవడంతో ఆ గ్రామ రైతులు బుధవారం కులగణన సర్వేను బహిష్కరించారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో రైతులు రాస్తారోకో చేపట్టారు. అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు కదిలేది లేదని రైతులు తెలిపారు.

Tags:    

Similar News