వాంకిడి గిరిజన ఆశ్రమోన్నత పాఠశాల హెచ్ఎం సస్పెండ్..
వాంకిడి గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలో హెచ్ఎం శ్రీనివాస్ ను గురువారం సస్పెండ్ చేస్తూ ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
దిశ, వాంకిడి : వాంకిడి గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలో హెచ్ఎం శ్రీనివాస్ ను గురువారం సస్పెండ్ చేస్తూ ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 30న ఆశ్రమంలో ఫుడ్ పాయిజన్ తో 60 మందికి పైగా విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలైన నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో లోకేశ్వర్ రావు ఆధ్వర్యంలో విచారణ జరిపి నివేదించగా, గురువారం హెచ్ఎంను సస్పెండ్ చేస్తూ పీవో ఉత్తర్వులు జారీ చేశారు.