మీరైనా నా సమస్యను పరిష్కరించండి ఫ్లీజ్​....

డీఎస్సీ 2024 స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జీటీ విభాగంలో నిర్మల్ జిల్లా సెకండ్ ర్యాంక్ సాధించిన తనకు ఉద్యోగం ఇవ్వలేదంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బాధితుడు చందుల వీరేష్ విన్నవించాడు.

Update: 2024-11-15 15:09 GMT

దిశ, భైంసా : డీఎస్సీ 2024 స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జీటీ విభాగంలో నిర్మల్ జిల్లా సెకండ్ ర్యాంక్ సాధించిన తనకు ఉద్యోగం ఇవ్వలేదంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బాధితుడు చందుల వీరేష్ విన్నవించాడు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారం ముగించుకుని భైంసా పట్టణానికి రాగా స్థానిక పట్టణ విశ్రాంతి భవనంలో జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.

     మీడియాతో మాట్లాడిన అనంతరం బాధితుడు వీరేష్ మంత్రితో తన గోడును తెలిపాడు. క్వాలిఫికేషన్ కరెక్ట్ గానే ఉన్నా క్లారిఫికేషన్ లేదంటూ సంబంధిత అధికారులు జిల్లా సెకండ్ ర్యాంక్ సాధించిన తనను పక్కన పెడుతున్నారని పేర్కొన్నాడు. దీంతో స్పందించిన మంత్రి ర్యాంక్ వచ్చిన ఉద్యోగం ఇవ్వక పోవడానికి గల కారణాలను విచారణ చేసి న్యాయం చేయండని కలెక్టర్ అభిలాష అభినవ్ కి ఆదేశించారు. 


Similar News