విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి.. టీయూటీఎఫ్

ఉపాధ్యాయ, విద్యారంగంలో నెలకొని ఉన్న పలు సమస్యల పరిష్కారానికి చొరవచూపాలని టీయూటీఎఫ్ జిల్లానాయకులు మంగళవారం రాష్ట్రమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.

Update: 2022-10-04 09:12 GMT

దిశ, నిర్మల్ కల్చరల్ : ఉపాధ్యాయ, విద్యారంగంలో నెలకొనిఉన్న పలుసమస్యల పరిష్కారానికి చొరవచూపాలని టీయూటీఎఫ్ జిల్లానాయకులు మంగళవారం రాష్ట్రమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్రశాఖ ఇచ్చిన పిలుపు మేరకు నిర్మల్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మురళీమనోహర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పుట్ట రవికిరణ్, రాష్ట్ర బాధ్యులు తోట గంగాధర్, జిల్లా గౌరవ అధ్యక్షులు పరమేశ్వర్ రెడ్డి, జిల్లా కోశాధికారి పోల ధర్మరాజ్, జిల్లా సహద్యక్షులు వహీద్ ఖాన్, జిల్లా సంయుక్త కార్యదర్శి మేడారపు శ్రీనివాస్, ఆయా మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మతీన్, సునీల్ రెడ్డి, పాండురంగ చారి, కరిపే శివ ప్రసాద్, వినోద్ రాజ్, ముత్తన్న, రఘువీరపాణి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News