మోదీ పాలనకు ప్రజలు ఆకర్షితులవుతున్నారు

ప్రజలు మోదీ పాలనతో పాటు బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులవుతున్నారని ఆ పార్టీ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.

Update: 2024-03-18 10:19 GMT

దిశ, ఆదిలాబాద్: ప్రజలు మోదీ పాలనతో పాటు బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులవుతున్నారని ఆ పార్టీ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జైనథ్ మండలంలో కాప్రి గ్రామంలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ తంతెన రవీందర్‌తో పాటు 200 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. సోమవారం జైనాథ్ మండలం బెల్లూరి ప్రవీణ్ ఆధ్వర్యంలో 100 మంది బెల్లూరి గూడ, నుంచి పెద్ద ఎత్తున యువకులు గ్రామస్థులు భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో చేరారు. వారందరికీ బీజేపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకోవాలనే ఆలోచనతోనే ఉన్నాయని ఆరోపించారు.

అందుకే సాధ్యం కాని హామీలు ఇచ్చి ఎన్నికల అనంతరం మర్చిపోతున్నాయని విమర్శించారు. బీఆర్‌‌ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయకుండా నిధులు దారి మళ్లించారని తెలిపారు. కోట్ల రూపాయలు ప్రధానమంత్రి అవాస్ యోజన క్రింద మంజూరయ్యాయని, ఆ నిధులు డబుల్ బెడ్రూం కోసం వాడుకున్నారని అన్నారు. కానీ ఎక్కడ కూడా నరేంద్రమోదీ పేరు, కేంద్రం నిధులని గాని చెప్పలేదు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమేనని అన్నారు. ఇక 6 గ్యారంటీల ఆశచూపి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చి హామీల సంగతి ఏమయ్యిందని ప్రశ్నిస్తే గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిందని చెప్పడం శోచనీయమన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపించాలని, మరోసారి కేంద్రంలో అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాందాస్, చిలుకూరి జ్యోతి రెడ్డి రమేష్ పోతరాజు, రాకేష్ రెడ్డి, అశోక్ రెడ్డి, రమేష్ రెడ్డి తదితరులున్నారు.


Similar News