దర్జాగా సింగరేణి స్థలాల కబ్జాలు

కోల్ బెల్ట్ మందమర్రి డివిజన్ రామకృష్ణాపూర్ క్యాతన్ పల్లి పురపాలక పట్టణంలో సింగరేణి ఖాళీ స్థలాలకు రక్షణ నోచుకోకపోవడంతో స్థలాలు కాస్త అన్యాక్రాంతానికి గురవుతున్నాయి.

Update: 2023-09-18 14:45 GMT

దిశ, రామకృష్ణాపూర్ : కోల్ బెల్ట్ మందమర్రి డివిజన్ రామకృష్ణాపూర్ క్యాతన్ పల్లి పురపాలక పట్టణంలో సింగరేణి ఖాళీ స్థలాలకు రక్షణ నోచుకోకపోవడంతో స్థలాలు కాస్త అన్యాక్రాంతానికి గురవుతున్నాయి. రామకృష్ణాపూర్ పట్టణంలో ప్రధాన రహదారుల పక్క సింగరేణి స్థలాలు ఉండటంతో కొందరు నాయకుల అండదండలతో యథేచ్ఛగా కబ్జాలకు తెగబడుతున్నారు.

రోడ్డు పక్క స్థలాలకు మంచి రేట్లు పలుకుతూ ఉండటంతో కబ్జాదారులు స్థలం పై లోన్ తీసుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేసిన ఫలించక పోవడంతో జీవో 76 పట్టాపొందడానికి రెవెన్యూ అధికారులు సహకారాలు ఉండగా ఓ కబ్జాదారుడికి స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలం ఉన్నట్టు పలువిమర్శలు వినిపిస్తున్నాయి. వారికి అధికారపార్టీ అండ పుష్కలంగా ఉండడంతో సింగరేణి అధికారులకు ఏం చేయాలో తెలియక నిస్సాహాయస్థితిలో ఉన్నారు.


Similar News