బస్సులో మద్యం మత్తులో న్యూ సెన్స్ !

ఆర్టీసీ బస్సులో మద్యం మత్తులో ఒక ప్రయాణికుడు న్యూసెన్స్ చేసిన సంఘటన వెలుగులోకి చూసింది.

Update: 2024-10-08 15:22 GMT

దిశ, కుబీర్ : ఆర్టీసీ బస్సులో మద్యం మత్తులో ఒక ప్రయాణికుడు న్యూసెన్స్ చేసిన సంఘటన వెలుగులోకి చూసింది. మంగళవారం బైంసా నుండి కుబీర్ కు మధ్యాహ్న సమయంలో వెళ్లే ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో కిక్కిరిసి ఉంది. ప్రయాణికులు వెళ్లే మార్గంలో మద్యం మత్తులో ఒక ప్రయాణికుడు కునుకు తీశాడు. తోటి ప్రయాణికులు చెప్పిన వినలేదు. డ్రైవర్ కండక్టర్ వచ్చి సెక్యూరిటీ సిబ్బందికి తెలియజేసేందుకు వెళ్లిన వారు అందుబాటులో లేరు. అప్పటికే అరగంట నుంచి బస్సులో కూర్చున్న ప్రయాణికులు ఉక్కపోతతో అవస్థలు పడ్డారు. ప్రయాణికులు మేముంటాం మీరు రండి అంటూ భరోసా ఇవ్వడంతో అతన్ని కిందికి దించి బస్సు కదిలించారు.


Similar News