రాష్ట్రం లో నిర్మల్ పేరు నిలబడాలి

రాష్ట్రంలో నిర్మల్ పేరు నిలబడాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.

Update: 2025-01-05 14:28 GMT

దిశ, ప్రతినిధి నిర్మల్ : రాష్ట్రంలో నిర్మల్ పేరు నిలబడాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఆదివారం నిర్మల్ ఉత్సవాల వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం వేడుకలు నేటి నుంచి 7వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నిర్మల్ ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్, అదనపు కలెక్టర్లు పరిశీలించారు.

    పాఠశాలల విద్యార్థులు, వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి, మహిళా స్వయం సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లలోని వస్తువులను పరిశీలించి అభినందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లా చరిత్రను, సంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంబంధిత అధికారులు కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. నిర్మల్ మహోత్సవాల కార్యక్రమానికి జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 


Similar News