'15 రోజుల్లో విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేస్తాం'
బెల్లంపల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శనివారం నిర్వహించారు.
దిశ, బెల్లంపల్లి : బెల్లంపల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శనివారం నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత అధ్యక్షతన జరిగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను లేవనెత్తారు. విద్యుత్ మీటర్ల సమస్యపై మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత మాట్లాడుతూ 15 రోజులలో విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారని తెలిపారు. ఈ మేరకు బెల్లంపల్లి పట్టణంలో ఎలక్ట్రికల్ మీటర్ల సమస్యపై ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డీఈ, ఏడీఈ, ఏఈ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమస్యను పరిష్కరిస్తామని సమావేశంలో హామీ ఇచ్చారు.
బెల్లంపల్లి పట్టణంలో మహాత్మాగాంధీ విగ్రహం నుండి కొత్త బస్టాండ్ వరకు ప్రస్తుతం ఉన్న సెంట్రల్ లైటింగ్ కేబుల్ చెడిపోయినందున ఆ కేబుల్ ను మార్చి ఫోర్కొర్ సెంట్రల్ లైటింగ్ కేబుల్ ను ఏర్పాటు చేయాలని కౌన్సిల్ తీర్మాణం చేసింది. బెల్లంపల్లి పట్టణ మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి భూ వినియోగ సర్వే కోసం ఎమ్ఎస్ ట్రూ క్యూబ్ సర్వేను చేపట్టాలని కౌన్సిల్ నిర్ణయించింది. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, అధికారులు కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.