కంటి వెలుగు.. ప్రతి ఇంటికి వెలుగు..
బెల్లంపల్లి మండలం పెరకపల్లి గ్రామంలో కంటివెలుగు శిబిరాన్ని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మంగళవారం ప్రారంభించారు.
దిశ, బెల్లంపల్లి : బెల్లంపల్లి మండలం పెరకపల్లి గ్రామంలో కంటివెలుగు శిబిరాన్ని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పరిపూర్ణమైన ఆరోగ్యంతో జీవించాలననే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బృహత్తరమైన పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరి కంటి ఆరోగ్యం మెరుగుపరచడం కోసం కంటి వెలుగు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
కంటి వెలుగు ప్రతి ఇంటికి వెలుగును ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీవైస్ చైర్మన్ సత్యనారాయణ, ఎంపీపీ గోమాస శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రాణి-సురేష్, ఎంపీటీసీ సుభాష్ రావు, స్థానిక సర్పంచ్ పద్మావతి, వార్డుసభ్యులు, కో ఆప్షన్ సభ్యుడు అశోక్ గౌడ్, ప్రజాప్రతినిధులు, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గణేష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు భీమగౌడ్, రాజేశ్వర్, మల్లేష్, ఎంపీడీఓ రాజేందర్, ఎంపీఓ శ్రీనివాస్, తాళ్లగురిజాల పీహెచ్ సీ మెడికల్ ఆఫీసర్ అనీష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.