మార్కెట్లలో మొదలైన పూలసందడి..
తెలంగాణ ఆడపడుచులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సద్దుల బతుకమ్మ పండగ రానే వచ్చేసింది.
దిశ, బెల్లంపల్లి : తెలంగాణ ఆడపడుచులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సద్దుల బతుకమ్మ పండగ రానే వచ్చేసింది. సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలకు మహిళలు సన్నద్ధమవుతున్నారు. అందుకోసం రకరకాల పూలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో పూల మార్కెట్లన్నీ కలకలలాడుతున్నాయి. ఈ క్రమంలోనే బెల్లంపల్లి పట్టణంలోని మార్కెట్ కూడా పూల పండుగ సందడి నెలకొంది.
సద్దుల బతుకమ్మ పురస్కరించుకొని పట్టణంలోని బజార్ ఏరియాలో పూల అమ్మకాలు జోరందుకున్నాయి. బతుకమ్మను పేర్చడం కోసం మహిళలు పోటీపడి పూల కొనుగోలు చేస్తున్నారు. దీంతో బజార్ ఏరియా పూల అమ్మకాలతో సందడిగా మారింది. మార్కెట్ లో అన్ని రకాల పూలు లభించడంతో మహిళలు పెద్దఎత్తున పూలను కొనుగోలు చేస్తున్నారు. మరో వైపు బతుకమ్మ నిమజ్జనం కోసం బెల్లంపల్లి బస్తి పోచమ్మ చెరువువద్ద ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం కోసం అధికారులు విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు.