వేస్టేజ్ పదార్థాలతో రాఖీల తయారీ.. స్టూడెంట్ల గొప్ప ఆలోచన

Update: 2024-08-17 12:24 GMT

దిశ,భైంసాః బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ అనే కాన్సెప్ట్ తో కృత్రిమంగా తమకు లభ్యమైన వేస్టేజ్ పదార్థాలతో తమ సృజనాత్మక ఆలోచనలకు పదును పెట్టారు స్కూల్ స్టూడెండ్లు. ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు చేసిన రాఖీలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒక్కో తరగతికి చెందిన విద్యార్థులు డిఫరెంట్ మోటివేషన్ థిమ్ తో అందంగా రాఖీలను తయారు చేసిన విధానం అందర్నీ అబ్బురపరుస్తుంది. పట్టణంలో వేదం పాఠశాల కి చెందిన విద్యార్థులు నాలుగువేలకు పైగా రాఖీలు తయారు చేయగా, ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ రాఖీ లను పట్టణ బస్టాండ్ సమీపంలో విక్రయిస్తామని తెలిపారు. పైగా ఈ రాఖీలు అమ్మగా వచ్చిన డబ్బులు చారిటీ సంస్థలకు, సమాజబాగు కొరకు డొనేట్ చేస్తాంమని విద్యార్థులు పేర్కొనడం విశేషం.

Tags:    

Similar News